ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులు పడుతున్నాయి. కొత్త కొత్త నీళ్లతో సెలయేర్లు జాలువారుతూ కనువిందు చేస్తాయి. అందుకే చాలామంది వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ సందర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
హమ్మయ్య.. బై బై.. ఎండాకాలం. వరుణుడు కాస్త కరుణించాడు. ఇప్పుడిప్పుడే వాతావరణం చల్లబడుతోంది. వర్షాలు కురుస్తున్నాయి. ఇంకో కొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు కూడా తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. వర్షాలే వర్షాలు ఇక. ఎండ బాధ ఉండదు. ఈ సమయంలోనే ట్రిప్స్ కు ప్లాన్ చేసుకునే వాళ్లు ఖచ్చితంగా సందర్శించాల్సింది వాటర్ ఫాల్స్.
ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులు పడుతున్నాయి. కొత్త కొత్త నీళ్లతో సెలయేర్లు జాలువారుతూ కనువిందు చేస్తాయి. అందుకే చాలామంది వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ సందర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
ఇక తెలంగాణలో వాటర్ ఫాల్స్ అంటేనే గుర్తుకొచ్చేది కుంతాల వాటర్ ఫాల్స్. తెలంగాణలోనే అతిపెద్ద జలపాతం అది. ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. నేరెడిగొండ మండలంలో కడెం నదిపై ఉంటుంది ఈ వాటర్ ఫాల్. పేద్ద కొండ నుంచి లోయలోకి దునుకుతూ కనిపించే సెలయేటి దృశ్యాలను చూసి తరించాల్సిందే.
మరి కుంతాల జలపాతానికి ఎలా చేరుకోవాలో తెలుసా? హైదరాబాద్ నుంచి ఇది 271 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్లి అక్కడి నుంచి నేరెడిగొండ వెళ్లాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జలపాతం. జలపాతం వద్దకు బస్సులు ఉంటాయి. జలపాతం కిందికి దిగడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది.
ఎప్పుడూ పనేనా. కాసేపు పనికి విశ్రాంతినిచ్చి… వీకెండ్ లో అలా కుంతాల జలపాతాన్నిసందర్శించి.. కొత్త కొత్త నీటితో పరవశించిపోయే జలపాతంలో జలకాలాడి.. ప్రకృతి మధ్య సేదతీరి ప్రశాంతంగా గడిపి రండి. ఆ మజాయే వేరు. మీ మైండ్ కూడా సూపర్ గా ఫ్రెష్ అవుతుంది.