ఝరి వాటర్ ఫాల్స్.. మీ ట్రిప్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్లేస్..!

-

ఈ వాటర్ ఫాల్ చుట్టూ కొండలు, పెద్ద అడవి. చిక్ మగళూర్ కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఝరి వాటర్ ఫాల్ వద్ద కూడా అన్నీ కాఫీ తోటలే. కొండల్లో, గుట్టల్లో వర్షాలకు కురిసిన నీరు.. జలజలా పారుతూ.. కొండల మీది నుంచి కింద సెలయేరులా పారుతాయి.

మీకు కర్ణాటకలోని చిక్ మగళూర్ తెలుసా? పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు చిక్ మగళూర్. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు.. జలజలా పారే సెలయేర్లు.. ఆహా.. చెప్పడం కాదబ్బా.. చిక్ మగళూర్ కు వెళ్లి తీరాల్సిందే. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి సుమారు 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిక్ మగళూర్. అక్కడికి వెళ్తే.. చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది.

కానీ.. మీరు ట్రావెల్ లిస్ట్ లో చిక్ మగళూర్ పెట్టుకుంటే.. ఝరి వాటర్ ఫాల్స్ ను మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. చిక్ మగళూర్ నుంచి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఝరి వాటర్ ఫాల్.

వీటినే బట్టర్ మిల్క్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. పైనుంచి జాలువారే నీళ్లు.. తెల్లగా.. బట్టర్ మిల్క్ లా ఉంటాయని దానికి ఆ పేరు పెట్టారు. చిక్ మగళూర్ జిల్లాలోని అట్టిగుండి వద్ద ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి. చిక్ మగళూర్ లోనే ది బెస్ట్ వాటర్ ఫాల్ ఇది.

ఈ వాటర్ ఫాల్ చుట్టూ కొండలు, పెద్ద అడవి. చిక్ మగళూర్ కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఝరి వాటర్ ఫాల్ వద్ద కూడా అన్నీ కాఫీ తోటలే. కొండల్లో, గుట్టల్లో వర్షాలకు కురిసిన నీరు.. జలజలా పారుతూ.. కొండల మీది నుంచి కింద సెలయేరులా పారుతాయి. పై నుంచి కింద జాలువారే నీళ్లన్నీ స్విమ్మింగ్ పూల్ లా రూపుదిద్దుకోవడంతో.. ఆ పూల్ లో ఏంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. పైనుంచి పడే నీటి ముందు నిలబడి… ఆహ్లాదాన్ని పొందొచ్చు.

అయితే.. ఈ వాటర్ ఫాల్స్ కు వెళ్లడం అంత ఈజీ కాదు. రోడ్డు నుంచి 4 కిలోమీటర్లు లోపలికి నడవాలి. అది కూడా అడవిలోపల నడవాలి. అప్పుడే ఈ ఫాల్స్ కు చేరుకోగలం.

ఈ వాటర్ ఫాల్స్ ను సందర్శించే సరైన సమయం వర్షాకాలం. వర్షాకాలం ముగిసే సమయంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ ను సందర్శించొచ్చు. అంటే.. ఆగస్టు నుంచి జనవరి మధ్యలో ఈ వాటర్ ఫాల్ ను సందర్శించొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version