జగన్ సీఎం అయితే తమకు కష్టాలు తప్పవని భావిస్తున్న టీడీపీ అనుకూల మీడియాలో పనిచేసే కొన్ని పెద్ద తలకాయలు ఇప్పటికే కలత చెందుతున్నాయట.
తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, అటు యావత్ దేశ వ్యాప్త ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తేదీ.. మే 23.. ఎందుకంటే ఆ రోజు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కానున్నాయి మరి. అందుకనే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరిని కదిపినా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరోవైపు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా మే 23న రానున్న ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అయితే మే 23వ తేదీన ఎలాగూ ఫలితాలు వస్తాయి సరే.. కేంద్రంలో బీజేపీ లేదా కాంగ్రెస్ లేదా హంగ్ వచ్చే అవకాశం ఉంది అని సర్వేలు చెబుతున్నాయి.. ఓకే.. మరి ఏపీ పరిస్థితేంటి.. అవును, అక్కడ జగన్ సీఎం అవుతాడని ఇప్పటికే ఎన్నో సర్వేలు చెప్పాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఓటమిని ఇప్పటికే అంగీకరించారని, అందుకే ఆయనకు ఏం చేయాలో అర్థం కాక ఈవీఎంలు, వీవీ ప్యాట్లు అంటూ కాలక్షేపం చేస్తున్నారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే నిజంగానే సర్వేలు చెప్పినట్లు జగనే ఏపీకి సీఎం అయితే.. ఆయన్ను వ్యతిరేకిస్తూ వచ్చిన, ఆయన్ను అణగదొక్కాలని చూసిన వారి పరిస్థితేమిటి..? వారికి జగన్ సీఎం అయ్యాక చుక్కలు చూపిస్తారా..? అందుకు అవుననే కొంత వరకు సమాధానం వస్తున్నట్లు మనకు కనిపిస్తోంది.
2014లో ఎన్నికలు జరిగి ఏపీకి చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఆయన అనుకూలురు, అనుకూల మీడియా, ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు, ఆఖరికి కొందరు పోలీసులు కూడా.. జగన్ పట్ల వ్యతిరేకతను కనబరిచారు. టీడీపీతోపాటు వారికి అనుకూల మీడియా కూడా జగన్‌ను అణగదొక్కేందుకు యత్నించారన్నది కాదనలేని వాస్తవం. అయితే కాలం గిర్రున తిరిగింది. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ప్రజల నాడి ఇప్పటికే తెలిసిపోయింది. ఈసారి చంద్రబాబు మళ్లీ సీఎం కారని లోకైం కూస్తోంది. ఈ క్రమంలో ఒకప్పుడు ఆయనకు వంత పాడిన నాయకులు, మీడియా, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు జగన్ సీఎం అవబోతున్నారని తెలిసి జంకుతున్నారట.
జగన్ సీఎం అయితే తమకు కష్టాలు తప్పవని భావిస్తున్న టీడీపీ అనుకూల మీడియాలో పనిచేసే కొన్ని పెద్ద తలకాయలు ఇప్పటికే కలత చెందుతున్నాయట. దీంతో ఆ మీడియా ప్రతినిధులు జగన్ సీఎం అయిన మరుక్షణమే తమ సంస్థలను వదిలిపెట్టి వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అందుకనే వారు మే 23వ తేదీ ఫలితాల వరకు ఆగుతున్నారట. అలాగే ఆ మీడియా ప్రతినిధులు పనిచేస్తున్న సంస్థలు కూడా వారిని మానేయాలని చెబుతూ ఇప్పటికే ఒత్తిడి తెస్తున్నాయట. ఇక చిన్నా చితకా మీడియా చానళ్లు అయితే జగన్ సీఎం అయితే తమ పరిస్థితేంటని మదనపడుతూ.. తమ తమ చానల్స్‌ను అమ్ముకునేందుకు కూడా సిద్ధమవుతున్నాయట.
టీడీపీలో కీలకంగా ఉన్న కొందరు నేతలు జగన్ సీఎం అయితే ఏపీ నుంచి దూరంగా అమెరికాకు వెళ్లి సెటిల్ అవుదామని అనుకుంటున్నారట. ఇక జగన్ సీఎం అయిన పక్షంలో పలు ప్రభుత్వ శాఖలతోపాటు పోలీస్ శాఖలోనూ భారీ మార్పులు ఉంటాయని, టీడీపీకి అనుకూలంగా పనిచేసిన ఉద్యోగులను భారీ ఎత్తున బదిలీ చేస్తారని కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మొదట్నుంచీ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేసిన, చేస్తున్న కొందరు ఉద్యోగులకు ఇప్పటికే భయం మొదలైందట. మరి మే 23వ తేదీన ఫలితాలు వెలువడిన అనంతరం వైకాపా మెజారిటీ సీట్లు సాధించి జగన్ సీఎం అయితే.. పైన చెప్పినట్లుగా ఏపీలో భారీ మార్పులు సంభవిస్తాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!