ద్వీప దేశమైన మాల్‌దీవ్స్∙తమ పర్యాటకులను ఆకర్శించడానికి సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే వ్యాక్సిన్ ప్యాకేజీని రూపొందించి కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టిన మొదటి దేశంగా రికార్డు నెలకొల్పింది మాల్దీవ్స్ దేశం. మాల్దీవ్ సందర్శకులను మూడు రోజుల్లోపు పీసీఆర్ నెగెటివ్ వచ్చినవారిని లేదా కోవిడ్ టీకా వేసుకున్న పర్యాటకులకు అనుమతినిస్తోంది.
ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సిన్ లభిస్తున్నప్పటికీ, కరోనా వైరస్ సెకండ్ వేవ్ అనేక మంది జీవితాలను పీడిస్తోంది. అందుకే సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. మాల్దీవ్స్ ప్రయాణం చాలా విలాసవంతమైంది. పర్యాటక రంగాన్ని ఆకట్టుకుని దాన్ని పెండే ప్రయత్నంలో పర్యాటకులకు కొవిడ్ 19 టీకాను అందించే ప్రణాళికను ప్రకటించింది.
దక్షిణాసియా ద్వీపసమూహ పర్యాటక మంత్రి అబ్దుల్లా మౌసూమ్, సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, దేశాన్ని సందర్శించడానికి ప్రోత్సాహకంగా ‘విజిట్’, ‘వ్యాక్సిన్’, ‘వెకేషన్’ అనే ‘3 వీ’ ప్రణాళికను ప్రకటించారు.
పర్యాటక రంగం కనీస అసౌకర్యంతో సురక్షితంగా అందించాలనే ప్రధాన ఉద్దేశంతో తాము దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 3వీ టూరిజం నిర్ణయంపై ముందుకు వెళ్తామని మౌసుమ్ అన్నారు. మాల్దీవుల ప్రజలు ఎక్కువ శాతం పర్యాటక పరిశ్రమపై ఆధారపడిందని అందుకే ఇక్కడి ప్రజల తర్వాత తమ దేశాన్ని పర్యాటించే టూరిస్టులకు కూడా టీకా ఇవ్వనున్నామని అన్నారు.
ఇప్పటికే 90 శాతం మంది ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు టీకా అందించినట్లు అదే విధంగా సగం జనాభా కనీసం ఒక డోస్ తీసుకున్నారని, జనాభా కూడా తక్కువగా ఉన్నందుకు వ్యాక్సిన్ సరఫరా సమస్య ఉండదని మౌసుమ్ తెలిపారు. వివిధ స్నేహపూర్వక దేశాలు, సంస్థల నుంచి వ్యాక్సిన్ కోటా కూడా దీనికి సహాయపడుతుంది.
ప్రధానంగా భారత్ నుంచి ఈ ఏడాది 3,50000 మంది పర్యాటకులు హాలిడే ట్రిప్‌లో భాగంగా వచ్చారని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మాల్దీవుల ప్రయాణానికి మూడు రోజుల కంటే తక్కువ రోజుటు గడిపేవారిని లేదా పూర్తి టీకా డోసులను తీసుకున్నా, లేదా పీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన సందర్శకులను అనుమతిస్తోంది.