‘ఆంధ్రా ఊటీ’ ని చూడాల్సిన సరైన సమయం ఇదే…!

-

అందమైన ప్రకృతి… దట్టమైన పొగమంచు… మంచు తుంపరులు… చల్లని గాలులు… అబ్బా ఊహించుకుంటేనే ఎంత బాగుందో కదా…! అలాంటిది లంబసింగి వెళ్లి చూస్తే ఎంత బాగుంటుంది ..? ఏ స్విట్జర్లాండ్‌ కో … కాశ్మీర్ కో వెళ్ళక్కర్లేదు. మన లంబసింగిలోనే ఈ అందాలని అన్ని చూసి తరించవచ్చు. ఇదే సరైన సమయం కూడా. పర్యాటక ప్రియులు ముద్దుగా ‘కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ గా లేదా ‘ఆంధ్రా ఊటీ’ గా పిలుస్తారు. ఈ ఊరినే కొర్రబొయలు’ అని కూడా అంటారు.

lambasingi

ఇక్కడ ఉన్న ప్రదేశాలు ఈ ప్రాంతంలో పర్యటించే ప్రతీ ఒక్కరిని మైమరపిస్తాయి. లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒక్క ట్రిప్ వేసుకుంటే అన్నింటిని ఒక లుక్ వేసేయొచ్చు. లంబసింగి ఘాట్ ‌రోడ్డులో అందమైన కాఫీ తోటలు విస్తారంగా వున్నాయి. ఇవి బాగా ఆకట్టుకుంటాయి. అలానే లంబసింగి చేరుకునే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది. దీనికి అర కిలోమీటరు దిగువన జలపాతం వుంది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. కుటుంబ సమేతంగా దానిని కూడా చూసేసి ఫోటోలు తీసుకోవచ్చు.

ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లొచ్చాయి. ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతాయో తెలుసా…? శీతాకాలంలో 0 డిగ్రీలు లేదా అంత కంటే తక్కువగా నమోదైతాయి. మిగితా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదైతాయి. ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో ప్రకృతి అందాల బ్యాక్ డ్రాప్ తో సెల్ఫీలు , గ్రూప్‌ ఫొటోలు తీసుకుంటూ హడావుడి చేస్తారు. కాశ్మీరాన్ని తలపించే లోయలు పర్యాటకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version