పలు బ్యాంకుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. తప్పక వాటి కోసం తెలుసుకోండి. వివరాల లోకి వెళితే ఆంధ్రా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. మీకు ఆంధ్రా బ్యాంక్, లేదా కార్పోరేషన్ బ్యాంక్‌లలో అకౌంట్ ఉంటె వీటిని గుర్తుంచుకోండి. మీ అకౌంట్ నెంబర్ మారదు. అలానే డెబిట్ కార్డును గడువు పూర్తయ్యే దాకా వాడుకోవచ్చు.
అలానే దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనం చేసిన సంగతి తెలిసినదే. ఒకవేళ ఈ రెండు బ్యాంకుల్లో మీకు ఖాతాలు ఉన్నట్టయితే మార్చి 1 నుంచి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అమలులోకి వస్తున్నాయి గమనించండి. అంతే కాదు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోకి విలీనం చేసిన సంగతి తెలిసిందే. రెండు బ్యాంకులకు సంబంధించి ఐఎఫ్ఎస్‌సీ కోడ్ , చెక్ బుక్‌లు మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉండనున్నాయి. కొత్త కోడ్స్ ఏప్రిల్ ఒకటి నుండి రానున్నాయి.