ఆత్మనిర్భర్ యాప్ తో.. దేశీయ యాప్స్ అన్ని ఒక్కచోటే పొందండి.. !!

-

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి గాను మనదేశ వీడియో షేరింగ్ యాప్ అయిన మిత్రోన్.. ఆత్మనిర్భర్ యాప్స్ ‌ను గూగుల్ ప్లేస్టోర్‌ లో లాంచ్ చేసింది. అయితే వేరు వేరు సేవలు, అందరి అవసరాలను తీర్చడం కోసం రూపొందించిన యాప్ ఇది. అయితే అన్ని దేశీయ యాప్స్ అన్నిటినీ ఒకే ప్లాట్‌ ఫాం మీదకు తీసుకురావడమే దీని లక్ష్యం. అయితే ఈ యాప్ లో బిజినెస్, ఈ-లెర్నింగ్, న్యూస్, హెల్త్, షాపింగ్, గేమ్స్, యుటిలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, సోషల్ వంటి అన్ని కేటగిరీలకు సంబంధించిన యాప్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అయితే ఈ ఆత్మనిర్భర్ యాప్స్ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎటువంటి చార్జీలు వసులు చేయరు. అలాగే మనదేశంలో డెవలపర్లు రూపొందించిన 100 భారతీయ యాప్ ‌లను ఇందులో చూడవచ్చు. అలాగే దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒక్కసారి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు అన్ని భారతీయ యాప్స్ ‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆరోగ్యసేతు, భీం, నరేంద్రమోదీ యాప్, జియో టీవీ, డిజిలాకర్, కాగజ్ స్కానర్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ వంటి అన్ని అవసరమైన యాప్స్ ఇందులో ఉంటాయి.

ఈ లిస్ట్‌ లో యాప్ సైజ్ ఎంత ఉంటుంది. ఎంతమంది భారతీయులు ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు, అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అనే అంశాలు ఇందులో పొందుపరిచి ఉంటాయి. ఇకపోతే ఈ యాప్ సైజ్ 12 mb గా ఉంది. ప్రస్తుతానికి 100 యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 2020 సంవత్సరం చివరి నాటికి గాను మొత్తం 500 రకాల యాప్స్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ – గవర్నెన్స్, యుటిలిటీ, అగ్రికల్చర్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్, ఈ-లెర్నింగ్‌ కు సంబంధించిన యాప్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లో ఉన్న లిస్టింగ్‌ లో మీరు ఏ యాప్ ‌ను ఎంచుకున్నా అది మిమ్మల్ని గూగుల్ ప్లే లిస్టింగ్‌ కు రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత అక్కడ నుండి మీరు ఈ యాప్ ‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version