వయసు 35.. అసభ్య వీడియోలు 1400.. జైలుశిక్ష 27 నెలలు!

-

రహస్య కెమెరాలతో మహిళలు, అమ్మాయిల వీడియోలు తీయడం అలవాటుగా పెట్టుకున్నాడో లేక బలహీనతగా మార్చుకున్నాడో తెలియదు కానీ… 35ఏళ్ల వయసున్న వ్యక్తి ఇదేపనిమీద ఉన్నట్లున్నాడు. ఈ క్రమంలో సుమారు 1400 మంది మహిళల, పిల్లల వీడియోలు తీశాడు.. ఫలితంగా జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన సింగపూర్ లో జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే… సుమారు 1400 మంది మహిళలు, పిల్లల అసభ్య వీడియోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి దాదాపు ఇదేపని మీద ఉంటాడో ఏమో కానీ… ఏకంగా 1400 వీడియోలు రహస్యంగా తీశాడు. ఈ వీడియోలు తీయడానికి స్పై వాచ్‌లు, పెన్ కెమెరాలు, మొబైల్స్ వాడినట్లు తెలుస్తుంటుండగా… బస్సులు, ట్రైన్లలో వెళ్తున్న మహిళల అసభ్య ఫొటోలు కూడా తీశాడని అధికారులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఇతగాడి ప్రధాన టార్గెట్ బాత్రూం లే! అవును… స్నానాల గదిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్న వీడియోలు ఈ లిస్ట్ లో అధికంగా ఉన్నాయంట.

ఇదే క్రమంలో దాదాపు 800 సందర్భాల్లో అతను వీడియోలు తీసినట్లు అధికారులు చెబుతున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరచగా.. నిందితుడికి రెండు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news