ప్రముఖ సన్యాసి గోల్డెన్ బాబా మృతి చెందారు. ఈ బాబాకు బంగారం ధరించడం అంటే చాలా ఇష్టం. లక్ష్మీ దేవతను తన ఇష్ట దేవతాగా కొలుస్తూ ఉంటాడు గోల్డెన్ బాబా. దాంతో నిత్యం తన వంటి మీద చాలా బంగారాన్ని ధరిస్తూ ఉంటాడు గోల్డెన్ బాబా. బాబాకు సెక్యూరిటీగా 30 మంది బాడిగార్డులు ఎప్పుడూ బాబా చుట్టూ కాపలా కాస్తు ఉంటారు. గోల్డెన్ బాబా కొంతకాలంగా అస్వస్థత కు గురై చికిత్స పొందుతున్నాడు కాగా నేడు ఉదయం ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాబా స్వస్థలం ఘజియాబాద్ కానీ బాబా మార్కెట్ అంతా గాంధీనగర్‌లో ఉండటంతో గాంధీనగర్ లో గోల్డెన్ బాబా ఆశ్రమం ఏర్పాటు చేశారు. గోల్డెన్ బాబా కు అనేక మండి భక్తులు ఉన్నారు. సన్యాసిగా మారకముందు బాబా ఢిల్లీ లో వస్త్ర వ్యాపారి. గోల్డెన్ బాబా పై ఇప్పటివరకే అనేక కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్, దోపిడీ, దాడి, హత్యాబెదిరింపు తదితర నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
గోల్డెన్ బాబా ఇక లేరు…! విషాదంలో గోల్డెన్ బాబా భక్తులు….!
-