నేరెళ్ల ఘటనను రాజకీయం చేయాలని చూశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేరెళ్ల ఘటన తర్వాత బాధితులు వేములవాడ ఆసుపత్రిలో ఉంటే వెళ్లి కలిసి వాళ్లకి న్యాయం చేస్తా అని మాట ఇచ్చిన.. ఆతర్వాత అదే నేరెళ్లలో నాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని.. ఏదేదో చేయాలని చూశారు. కానీ అది ఫలించలేదని పేర్కొన్నారు.
నేరెళ్ల, తంగళ్లపల్లిలో ఉండే దళితులు, బీసీలంతా కేసీఆర్ నాయకత్వానికే ఓటు వేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఆర్ఎస్ బ్రదర్స్ పాలన కొనసాగుతోందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని.. పదవీ త్యాగం చేసి ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేస్తే.. ఎందరో బలిదానాల వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు.