ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు. వారి పరీక్షల నిమిత్తం బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు చేసేందుకు పోలీసులు రాగా.. బాబోయ్ నేను మందు తాగడం లేదు కనీసం వాటిని కూడా చూడలేదని తల బాదుకున్నాడు. అయినా అతడిని నమ్మకుండా పరీక్షలు నిర్వహించగా సదరు వ్యక్తి మద్యం సేవించాడని పోలీసులు తేల్చారు. ఇక్కడ అసలు నమ్మలేని విషయం ఏమిటంటే ఆ వ్యక్తి అసలు మద్యం సేవించనే లేదు. నిజంగానే ఆయన శరీరంలోనే మద్యం తయారవుతుందని కొన్ని రోజుల తర్వాత ఓ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించిన వైద్యులు నిర్ధారణ చేశారు.
ఇలాంటి వ్యాధి అరుదుగా వస్తుందని ఆటో బ్రూవరీ సిండ్రోమ్ కారణంగా కడుపులో ఉండే పిండి పదార్థాలను ఆల్కహాల్ గా మారుస్తుందని వైద్యులు తేల్చారు. దీంతో పోలీసులు అతని పై వేసిన ఆరోపణలను విరమించుకున్నారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు ఆ విషయాన్ని చెప్పడంతో పాటు హాస్పిటల్ వైద్య సిబ్బంది కూడా నివ్వెరపోయారని సదరు వ్యక్తి తెలియజేశాడు. నిజానికి ఆయన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న కడుపులో మాత్రం చివరికి ఆల్కహాల్ స్థాయిలను పెంచేస్తాయి.