దుమ్ములేపిన ” కేజిఎఫ్ “…!

-

రెండు ఏళ్ల కిత్రం వచ్చిన సినిమా. ఓటీటీలో ఆల్రెడీ జనాలు అరగదీసిన సినిమా. మరోవైపు అన్-అఫీషియల్ గా పైరసీలో అంతా చూసేసిన సినిమా. ఇలాంటి సినిమాను ఫ్రెష్ గా టీవీల్లో వేస్తే ఎవరైనా చూస్తారా? ఇలాంటి సందేహాల్ని పటాపంచలు చేసింది “కేజీఎఫ్”. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించిన రాకీ భాయ్.. బుల్లితెరపై కూడా దుమ్ముదులిపాడు.

kgf
kgf

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈనెల 5వ తేదీన స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన “కేజీఎఫ్” సినిమాకు 9.21 టీఆర్పీ వచ్చింది. ఈవారం ప్రసారమైన సినిమాల్లో రాకీదే అగ్రస్థానం. ఈ సినిమా దరిదాపుల్లోకి కూడా మరో సినిమా రాలేకపోయిందంటే.. బుల్లితెరపై రాకీ విశ్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు.

కేజీఎఫ్” మినహా ఈవారం టీవీల్లో కొత్త సినిమాలేవీ ప్రసారం కాలేదు. రెండో స్థానంలో “భద్ర”, మూడో స్థానంలో “రాక్షసుడు” సినిమాలు నిలిచాయి.ఇక ఓవరాల్ రేటింగ్స్ పరంగా ఎప్పట్లానే స్టార్ మా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా… ఊహించని విధంగా జీ తెలుగు రెండో స్థానానికి వచ్చింది. ఈటీవీ మూడో స్థానంలో నిలవగా.. జెమినీ ఛానెల్ నాలుగో స్థానానికి పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news