బిగ్‌బాస్‌ సీజన్‌ 4.. కంటెస్టెంట్లు కావలెను..?

-

అనేక భాషల్లో హిట్‌ అయిన బిగ్‌బాస్‌ షోను 2017లో తెలుగు బుల్లితెరకు కూడా పరిచయం చేశారు. స్టార్‌ మా మొదటి సీజన్‌ను అట్టహాసంగా నిర్వహించింది. తొలిసీజన్‌ కావడం, తెలుగులో షో ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం, తమకు తెలిసిన సెలబ్రిటీలు కావడం.. ఇవన్నీ ఒకెత్తు.. హోస్ట్‌గా జూనియర్‌ ఎన్‌టీఆర్‌ రావడం మరొక ఎత్తు.. వెరసి బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ ప్రేక్షకులను బాగా అలరించిందని చెప్పవచ్చు. కానీ రెండో సీజన్‌లో నాని పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు వచ్చే ఓట్లు, కౌశల్‌ ఆర్మీ పేరిట ఓట్ల మానిపులేషన్‌.. తదితర అంశాలతో షో కళ తప్పింది. కానీ సీజన్‌ 3లో నాగార్జున కొంత వరకు ఆకట్టుకున్నారు. అయినా ఓట్ల విషయంలో, షో నిర్వహణలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

bigg boss season 4 wanted contestants

అయితే సాధారణంగా ప్రతి సారీ జూన్‌ లేదా జూలైలో బిగ్‌బాస్‌ షో ప్రారంభం అవుతుంది. మొదటి సీజన్‌ జూలై 16, 2017న ప్రారంభం అయితే.. రెండోదాన్ని 2018 జూన్‌ 10కే ప్రారంభించారు. ఇక మూడో సీజన్‌ 2019, జూలై 21 వరకు ప్రారంభం అయింది. కానీ ప్రస్తుతం జరగాల్సిన నాలుగో సీజన్‌ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అసలు షోకు సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు వెల్లడి కాలేదు. సాధారణంగా షో విషయమై ప్రతి సారీ స్టార్‌ మా అధికారిక ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ వివరాలను వెల్లడించేది. ఇక షో ప్రారంభానికి వారం పది రోజుల ముందే హోస్ట్‌ ఎవరు, పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు అని క్లారిటీ వచ్చేది. కానీ ఈసారి ఈ వివరాలేవీ బయటకు తెలియడం లేదు. అంటే.. అసలు ఈసారి షో నిర్వహించడం లేదని తెలుస్తోంది.

కరోనా కారణంగానే ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ ఆలస్యం అవుతుందని సమాచారం. ఇక షోలో పాల్గొనేందుకు ప్రధానంగా కంటెస్టెంట్లు కూడా ఎవరూ దొరకడం లేదని తెలిసింది. అంతగా అవకాశాలు లేని సినీ నటి శ్రద్ధాదాస్‌తోపాటు యాంకర్‌ లాస్య, బిత్తిరి సత్తి, మంగ్లీ లాంటి వారు ఈసారి షోలో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కరోనా నేపథ్యంలో ఎందుకులే రిస్క్‌ చేయడం.. అని పలువురు సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారట. అందుకనే షోలో పాల్గొనే సాహసం ఎవరూ చేయడం లేదని తెలుస్తోంది. అందువల్లే షో నిర్వహణ ఆలస్యం అవుతుందని సమాచారం. అయితే కరోనా ప్రభావం తగ్గితే.. మరో 2 నెలల్లో గనక వ్యాక్సిన్‌ వచ్చి అంతా సెట్‌ అయితే.. అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలల్లో అయినా షోను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news