ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ఫ‌లితాలు వ‌చ్చేశాయి.. ఏముందంటే..?

-

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకాల సంయుక్త భాగ‌స్వామ్యంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసి ఇప్ప‌టికే ఫేజ్ 1, 2 హ్యూమ‌న్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను చేప‌ట్టిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే వారు చెప్పిన‌ట్లు ఆ ట్ర‌య‌ల్స్‌కు చెందిన ఫ‌లితాల డేటాను సోమ‌వారం విడుద‌ల చేశారు. అందులో ఆసక్తిక‌ర విష‌యాలు ఉన్నాయి.

oxford university published covid 19 vaccine phase 1 and 2 trail data

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన ChAdOx1 nCoV-19 అనే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఫేజ్ 1, 2 క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా మొత్తం 1077 మందికి ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ ఎవ‌రిలోనూ తీవ్ర‌మైన దుష్ప‌రిణామాల‌ను క‌లిగించ‌లేద‌ని తేల్చారు. చిన్న‌పాటి జ్వ‌రం, కండ‌రాలు, ఒళ్లు నొప్పులు, త‌ల‌నొప్పి వ‌చ్చాయ‌ని, వాటికి మెడిసిన్లు ఇచ్చామ‌ని సైంటిస్టులు తెలిపారు. ఈ క్ర‌మంలో స‌దరు వ్యాక్సిన్‌కు ఫేజ్ 1, 2 ట్ర‌య‌ల్స్‌లో విజ‌యం సాధించిన‌ట్లేన‌ని సైంటిస్టులు తెలిపారు.

కాగా ఈ ట్ర‌య‌ల్స్‌కు సంబంధించిన ఫ‌లితాల వివ‌రాల‌ను యూకేకు చెందిన మెడిక‌ల్ జర్న‌ల్ లాన్సెట్‌లో సోమ‌వారం ప్ర‌చురించారు. ఇక ప్ర‌స్తుతం ఇదే వ్యాక్సిన్‌కు ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ చేపట్టారు. సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ్యాక్సిన్‌ను ప్ర‌జా పంపిణీకి సిద్ధం చేస్తున్న‌ట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news