భగభగమంటున్న బంగారం ధర… అందుకోలేనంత ఎత్తుకి వెండి ధర…!

-

బంగారం ధరలు భగ్గుమన్నాయి. 53 వేల మార్కును దాటి పసిడి పరుగులు పెడుతోంది. మరోవైపు వెండి కూడా మొదటిసారి 60000 మార్క్ ను దాటింది. నేను దేశీయ మార్కెట్లో బంగారం రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం విలువ మొట్టమొదటిసారి రూ.50,026 కు చేరుకుంది. బంగారంతో పాటు వెండి కూడా పోటీపడి పెరిగింది.

gold
gold

నేడు కిలో వెండి ఒక్కరోజులోనే ఏకంగా 3502 రూపాయలు పెరిగి మొట్టమొదటిసారి అరవై వేల మార్క్ ను దాటి రూ. 60,844 కు చేరుకుంది. ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం విలువ రూ. 51,380 కు చేరుకుంది. బంగారం ఇంతెత్తున పెరగడానికి గల కారణం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరగడంతో అమెరికా డాలర్ విలువ బలహీనం కారణంగా బంగారం విలువ పెరుగుతోంది. అలాగే అమెరికాలో మరో భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారన్న నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి.

Read more RELATED
Recommended to you

Latest news