సిగరెట్… అనకూడదు గాని కొందరికి మాత్రం ఇది నిజంగా దరిద్రమే అని చెప్పాలి. సిగరెట్ బీడీ వంటివి తాగి వేలాది మంది ప్రతీ ఏటా ఏదోక రోగం తో ప్రాణాలు కోల్పోతునే ఉన్నారు. ఆర్ధికంగా కూడా దీని వలన ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఇదిల ఉంటే… కేరళలోని వేణుగోపాల్ నాయర్ అనే వ్యక్తికి సిగరెట్ లు అంటే పిచ్చి. అసలు అది లేకుండా అతను బ్రతికే పరిస్థితి ఉండేది కాదు. కాని ఆ అలవాటు ని మానుకున్నాడు.
వెంటనే సిగరెట్ ని వదిలించుకుని దానికి చేసే ఖర్చు ని ఆదా చేయడం మొదలుపెట్టాడు. అతను ఎన్ని సిగరెట్ లు రోజు తాగే వాడో ఆ సిగరెట్ ల ఖర్చు అంతా దాచాడు. సిగరెట్ తాగాలి అని అనిపించినా ప్రతీ సారి సిగరెట్ డబ్బులను తీసి దాచి ఏకంగా 5 లక్షలు చేసాడు. అతని వయసు 75 ఏళ్ళు. 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పటి నుంచి ఆయనకు సిగరెట్ అలవాటు ఉంది. ఇప్పుడు ఆ డబ్బుని దాచి తన ఇంటి మీద మరో ఇల్లు కట్టుకుంటున్నాడు.