హరియాణా అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు అందిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఈ స్టేషన్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీ, అయోధ్య, పంజాబ్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించేందుకు 15 మంది కుట్రపన్నుతున్నారని ఆ లేఖలో ఉంది. దీనికి ప్రధాన సూత్రధారి జలంధర్ రామామండీకి చెందిన రాజేశ్ వైశ్ అని లేఖ పేర్కొంది.
ఈ లేఖను పంపిన వ్యక్తి పేరు గూఢచారి మౌనిక అని ఉంది. ఉగ్రవాదులు తనను బంధిస్తే వారి నుంచి తప్పించుకుని లేఖ ద్వారా విషయం తెలియజేస్తున్నట్లు పేర్కొంది. ఈ దాడులు జరిపేందుకు పాకిస్థాన్ రూ.25కోట్లు ఇస్తున్నట్లు లేఖలో ఉంది.ఈ లేఖను అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌తో పాటు సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్కు కూడా పంపినట్లు మోనికా పేర్కొంది. దాడులకు కుట్ర పన్నుతున్న 15మందిలో సైన్యంలో పని చేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది.ఈ విషయంపై స్పష్టత కోరేందుకు అంబాలా కంటోన్మెంట్ డీఎస్పీ రామ్‌కుమార్‌ను మీడియా సంప్రదించింది. లేఖ వచ్చింది వాస్తవమేనని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతానికి దీనిని ఫేక్ అని భావిస్తున్నట్లు తెలిపారు.