సెప్టెంబరు 19 న యుఎఇలో ప్రారంభమయ్యే రాబోయే ఐపిఎల్ నుండి సురేష్ రైనా తప్పుకోవడంపై తాను చేసిన వ్యాఖ్యలను ఆ జట్టు యజమాని శ్రీనివాసన్ వెనక్కు తీసుకున్నారు. కొన్నేళ్లుగా సిఎస్‌కెకు రైనా చేసిన కృషిని శ్రీనివాసన్ ప్రశంసించారు. “అతను ఆటగాడిగా జట్టు కోసం చాలా కష్టపడ్డాడు. రైనా చేసిన అపారమైన కృషిని నేను అంగీకరిస్తున్నాను. అతను చాలా సంవత్సరాలు మాతో ఉన్నాడు. రైనా 5,368 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడన్నారు.
ఒక దశలో, ఫిట్‌నెస్ ఆందోళనల కారణంగా ఆటకు దూరమయ్యే ముందు కూడా వరుసగా 158 మ్యాచ్‌లను ఆడాడని ఆయన చెప్పుకొచ్చారు. రైనా ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఎడిషన్ నుండి వైదొలిగితే, నేను అతని నిర్ణయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాను అని స్పష్టం చేసారు. విజయం తలకెక్కింది అంటూ శ్రీనివాసన్ రైనా పై విమర్శలు చేసారు. వాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.