ప‌బ్‌జి గేమ్‌ను బ్యాన్ చేసినా.. ఇంకా అందుబాటులో ఉంది..!

-

భార‌త ప్ర‌భుత్వం ఈ నెల 2వ తేదీన మ‌రో విడ‌త‌గా 118 చైనా యాప్‌ల‌ను బ్యాన్ చేసింది. వాటిలో ప‌బ్‌జి గేమ్ కూడా ఉంది. ఈ గేమ్‌ను ఇప్ప‌టికే గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి తొల‌గించారు. అయితే గేమ్‌ను ఇంకా ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు బ్లాక్ చేయ‌లేదు. దీంతో ఈ గేమ్‌ను ఇప్ప‌టికీ ప‌బ్‌జి ప్రియులు ఆడుతున్నారు. ఆయా యాప్ స్టోర్స్ నుంచి గేమ్‌ను తొల‌గించినా ప్ర‌స్తుతానికి గేమ్ అయితే ప‌నిచేస్తోంది. ఇప్ప‌టికే గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉన్న‌వారు దాన్ని ఇంకా యాక్సెస్ చేయ‌గ‌లుగుతున్నారు. ప్ర‌స్తుతానికి కొత్త‌గా ఎవ‌రూ ఈ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే అవ‌కాశం లేకుండా పోయింది.

pubg mobile is still accessible

అయితే గేమ్‌ను నిషేధించే వారు ఫోన్ల‌లో ఈ గేమ్‌ను క‌లిగి ఉన్న‌వారు దీన్ని ప్ర‌స్తుతం ఇంకా ఆడ‌గ‌లుగుతున్నారు. గేమ్‌కు సంబంధించి స‌ర్వ‌ర్ల‌ను కూడా ఇంకా ష‌ట్ డౌన్ చేయ‌లేదు. అందువ‌ల్లే ప‌బ్‌జి ప్రియుల‌కు గేమ్ ఇంకా అందుబాటులో ఉంది. అయితే గేమ్ స‌ర్వ‌ర్ల‌ను కూడా ష‌ట్ డౌన్ చేశాక ఐఎస్‌పీలు బ్లాక్ చేస్తే ఇక గేమ్‌ను పూర్తిగా ఆడ‌లేరు. కాగా ప్ర‌స్తుతానికి ప్లేయ‌ర్లు భారీ సంఖ్య‌లో త‌గ్గ‌డంతో ఇప్పుడు ఈ గేమ్‌ను ఆడుతున్న వారికి చికెన్ డిన్న‌ర్స్ సుల‌భంగా అవుతున్నాయ‌ని చెబుతున్నారు. గేమ్‌లో విన్ అవ‌డం తేలిక‌వుతుంద‌ని అంటున్నారు.

కాగా ప‌బ్‌జి గేమ్‌కు గాను ఇప్ప‌టికే టెన్సెంట్ గేమ్స్ భార‌త ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని తెలిపింది. కానీ గేమ్ మ‌ళ్లీ అందుబాటులోకి వ‌స్తుందో, రాదో తెలియ‌డం లేదు. అయితే మ‌రోవైపు ఈ గేమ్‌కు చెందిన పీసీ, క‌న్సోల్ వెర్ష‌న్ల‌ను బ్యాన్ చేయ‌లేదు. దీంతో ప‌బ్‌జి ప్రియులు ఇప్పుడా ప్లాట్‌ఫాంల‌పై ప‌బ్‌జిని ఆడేందుకు య‌త్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news