హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌పై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తూ మంగళవారం హైకోర్టు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను 6 వారాల పాటు పోలీసుల అనుమతితో నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ధర్నా చౌక్ ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఏడాదిగా ఈ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా స్పందించకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.