టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన దిల్ రాజు ఓ పక్క సినిమాలను నిర్మిస్తూనే డిస్ట్రిబ్యూటర్ గా తన పంథా కొనసాగిస్తున్నాడు. ఈమధ్య నిర్మాతగా కాస్త సక్సెస్ రేటులో వెనుకబడి ఉన్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా పర్వాలేదు అనిపిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా ఓ తమిళ చిన్న సినిమా మీద కన్నేసిన దిల్ రాజు ఆ సినిమా రిలీజ్ అవకముందే చీప్ గా రీమేక్ రైట్స్ కొనేశాడు.
ఆ సినిమా కూడా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. సినిమా హిట్ అయ్యే సరికి దిల్ రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ సినిమా తెలుగు రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇప్పుడు దిల్ రాజుకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంతకీ దిల్ రాజు కొన్న ఆ సినిమా ఏది అంటే 96 మూవీ. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఆ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది.
ఆ సినిమా రిలీజై నెల రోజులవుతుంది. బుల్లితెరలో కూడా వచ్చినా థియేటర్ లో హౌజ్ ఫుల్ గా రన్ అవుతుంది. మంచి కంటెంట్ తో వచ్చిన 96 మూవీ తెలుగు రీమేక్ చేయాలనుకున్న దిల్ రాజుకి కాస్టింగ్ విషయంలో తర్జన భర్జన అవుతున్నాడు. విజయ్ లాగా నటించే నటుడెవరు.. త్రిషని రిప్లేస్ చేసే స్టార్ ఎవరని వెతుకుతున్నాడట. అంతేకాదు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే నటీనటులు సినిమాకు చాలా ప్రాధాన్యత కలిగించారు. వారు కూడా సినిమా సక్సెస్ లో భాగమవగా వారి ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలో తెలియట్లేదట. ఈ బాధ అంతా ఎందుకు ఎంచక్కా ఆ సినిమానే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే పోలా అని కొందరు సలహా ఇస్తున్నారట. మరి దిల్ రాజు 96 రీమేక్ చేస్తారా లేక డబ్ చేసి రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.