రెహమాన్ విడాకుల గురించి తనయుడు అమీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్-సైరాభాను ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరు విడాకులు తీసుకున్న తరువాత వీరిపై రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెహమాన్ తనయుడు అమీన్ స్పందించారు. తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ” మా నాన్న ఒక లెజెండ్. ఎన్ని ఏళ్ల నుంచి  వృత్తి పరంగానే కాదు.. వ్యక్తి గతంగానూ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అన్నాడు. ఎన్నో ఏళ్లనుంచి అద్భుతమైన మ్యూజిక్ ని అందించడమే కాదు.. ఎంతో మంది ప్రేమాభిమానాలను పొందిన వ్యక్తి. 

Rehman
Rehman

ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, లెగసీ గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి అవాస్తవాలు వ్యాప్తి చేయడం ఇప్పటి నుంచి అయినా ఆపండి. ఆయనను, ఆయన  వృత్తిని గౌరవిద్ధాం” అని పేర్కొన్నాడు. 

Read more RELATED
Recommended to you

Latest news