ఒప్పో ఫోన్ల‌పై క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు.. త‌క్కువ ఈఎంఐ స‌దుపాయం..

-

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో ప‌లు ఫోన్ల‌పై క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ఒప్పో రెనో 3 ప్రొ, రెనో 4 ప్రొ, ఎఫ్‌17, ఎఫ్‌17 ప్రొ ఫోన్ల‌ను కొనేవారికి ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి. హోం క్రెడిట్ ద్వారా కేవ‌లం రూ.777 మాత్ర‌మే డౌన్ పేమెంట్ చెల్లించి 7 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయంతో ఆ ఫోన్ల‌ను కొన‌వ‌చ్చు. అలాగే ఈ ఫోన్ల‌ను కొనేవారికి కాంటెస్ట్ నిర్వ‌హిస్తున్నారు. అందులో విన్ అయిన వారికి ఒప్పో ఎంకో డ‌బ్ల్యూ11 వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను గిఫ్ట్‌లుగా అంద‌జేస్తారు.

oppo gives cash back offers on its phones

ఒప్పో రెనో 4 ప్రొ ఫోన్‌పై బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఫెడ‌ర‌ల్ బ్యాంక్ కార్డుల‌తో 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే మ‌రో 7 నెల‌ల వ‌ర‌కు ఎక్స్‌టెండెడ్ వారంటీ ల‌భిస్తుంది. ఒప్పో రెనో 3 ప్రొ ఫోన్‌పై రూ.1,111 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. దీన్ని బ‌జాజ్ ఈఎంఐ కార్డు ద్వారా నెల‌కు కేవ‌లం రూ.1,333 ఈఎంఐకే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఒప్పో రెనో 3 ప్రొ ఫోన్‌పై కంపెనీ వ‌న్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫ‌ర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫ‌ర్‌కు వాలిడిటీ 7 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. రెనో 3 ప్రొ ఫోన్‌ను రూ.0 డౌన్‌పేమెంట్‌కే 8 ఈజీ ఈఎంఐల‌లో కొన‌వ‌చ్చు.

ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఒప్పో ఎఫ్‌17 సిరీస్ ఫోన్ల‌పై ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఫెడ‌ర‌ల్ బ్యాంక్ కార్డుల ద్వారా 7.5 శాతం వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు. అలాగే 6 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ల‌భిస్తోంది. ఎఫ్17 సిరీస్ ఫోన్ల‌ను కేవ‌లం రూ.17 డౌన్‌పేమెంట్ చెల్లించి పాకెట్ ఫ్రెండ్లీ ఈఎంఐ స్కీంతో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక పాత ఫోన్ల‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే 7 శాతం అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ బోన‌స్ ఇస్తారు. అలాగే ఫోన్ల‌ను కొన్న‌వారికి 70 శాతం అష్యుర్డ్ బైబ్యాక్‌ను అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news