వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒక బృందం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో గాలిస్తుండగా.. మరో బృందం తమిళనాడులోని కోయంబత్తూరులో వెతుకుతోంది. ఈనెల 23వ తేదీన కోయంబత్తూరులో సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టు పెట్టారు.
దీంతో ప్రకాశం జిల్లా ఎస్పీ కోయంబత్తూరు పోలీసుల సహకారం తీసుకుని ఆయన కోసం వెతుకుతున్నారు. కాగా, ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. రెండు సార్లు ఆయన ఫిజికల్‌గా విచారణకు అటెండ్ కాకపోగా వర్చువల్‌గా అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు.దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఒంగోలు పోలీసులు చేసుకుని ఆయన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. అయితే, ఇంట్లో ఎవరూ లేరని సిబ్బంది తెలపడంతో ఆయన కోసం రెండ్రోజులుగా వెతుకుతున్నారు. గతంలో టీడీపీ అగ్రనేతలపై అనుచితపోస్టులు పెట్టినందుకు ఆయన మీద కేసులు నమోదైన విషయం తెలిసిందే.