కరోనా సంక్షోభం సమయంలో వలస కార్మికులకు ఆపద్బాంధవుడిగా మారిపోయిన సోనుసూద్ ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. సహాయం కావాలి అని కోరిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం కాదు ఎంతో మంది నిస్సహాయులకు అండగా నిలబడి.. చేయూతనిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పాటు చేసి స్కాలర్షిప్ కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు సహాయం కావాలన్నా ప్రతి ఒకరికి సహాయం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను అని చెబుతున్నారు సోను సూద్.
ఇటీవలే మరో విద్యార్థికి సహాయం చేసాడు సోనూ. ఓ విద్యార్థి తనకు వచ్చిన మార్కులను అటాచ్ చేసి తను క్లాసు టాపర్ అని కానీ చదువుకొనే స్థోమత లేదు అని చెబుతూ సహాయం కోరాడు. అయితే సదరు విద్యార్థి విజ్ఞప్తి పై వెంటనే స్పందించిన సోనుసూద్… అతనికి ఐఏఎస్ అకాడమీ లో సీటు ఇప్పించ డంతో పాటు… ఆర్థిక వనరులు సమకూర్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. విద్యార్ధి ట్విట్ కి రిప్లై ఇస్తు నువ్వు కలెక్టర్ అవుతావు.. నీ కోసం సీట్ ఏర్పాటు చేశాను అంటూ రిప్లై ఇచ్చారు అంటూ రిప్లై ఇచ్చారు సోనూ సూద్.