చిరు కల నెరవేరి సరిగ్గా ఏడాది..!

-

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలితరం తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి కెరియర్ లోనే మొదటి హిస్టారికల్ మూవీ గా డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపానికి ప్రేక్షకులందరూ మంత్రముగ్ధులు అయ్యారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కి… హిస్టారికల్ మూవీ చేయాలనే చిరు కల సైరా నరసింహారెడ్డి సినిమా తో నెరవేరిన నేటికి ఏడాది పూర్తయింది. సరిగ్గా గత ఏడాది సైరా నరసింహారెడ్డి సినిమా ఇదే రోజున విడుదల అయింది. ఇక ఈ సినిమాలో సైరా నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించగా … మెగాస్టార్ భార్య పాత్రలో నయనతార.. ప్రియురాలి పాత్రలో తమన్నా నటనతో అదరగొట్టారు. ఇక ఈ సినిమాలో ప్రతి అంశం కూడా ప్రేక్షకులందరినీ ఒళ్ళు గగుర్లు పొడిచే విధంగా ఎంతగానో అలరించింది.

Read more RELATED
Recommended to you

Latest news