చెక్కుల పంపిణీకి పోలీసుల పహారా పై కేటీఆర్ సెటైర్లు..!

-

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలోని 13 గ్రామాలలో శనివారం పోలీసుల పహారా మధ్య ప్రభుత్వం చెక్కుల పంపిణీ చేసింది. ఈ వ్యవహారం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసారు. చారాణ కోడికి బారాణ మసాలా అంటూ సెటైర్లు వేశారు. 13 గ్రామాల్లో 26 CMRF చెక్కుల పంపిణీకి 25 వాహనాలు, 100 మంది పోలీసులతో భద్రత అని ప్రశ్నించారు. అసలు పంచిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల విలువెంత అని నిలదీశారు.

25 వాహనాలు, 100 పోలీసుల జీతభత్యాల ఖర్చు ఎంత అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడమే చట్టవిరుద్ధమని తెలిపారు. పోలీస్ బందోబస్తు పెట్టి మరీ పంపిణీ చేయించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండగా.. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబుతో చెక్కుల పంపిణీ చేయించడం సిగ్గుచేటు అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news