గత కొన్ని రోజుల నుంచి ఏపీ వాసులందరిని వరుసగా కురుస్తున్న వర్షాలు బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఎంతోమంది తీవ్ర భయాందోళన లోనే బతుకును బిక్కుబిక్కుమంటూ వెళ్లదీస్తున్నారు. అయితే మరోసారి ఏపీ లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రజా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో పలు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని… ఇటీవలే వాతావరణ శాఖ అధికారులతో పాటు విపత్తు నిర్వహణ శాఖ కూడా ప్రజలందరినీ హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది అంటూ తెలిపిన అధికారులు… పశ్చిమ గోదావరి లోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కడప కృష్ణా జిల్లాలో కూడా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని… లేకపోతే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు.