ఇషా కోపిక‌ర్ చుక్క‌లు చూపిస్తోంది!

-

ర‌చ్చ చేయాలంటే హీరోయిన్‌ల‌కి సోష‌ల్ మీడియా బెస్ట్ ప్లాట్ ఫామ్‌గా మారిపోయింది. లైమ్ లైట్‌లో లేక‌పోయినా ఆడియ‌న్స్‌, అభిమానులు త‌మ‌ని మ‌ర్చిపోతున్నార‌ని చిన్న అనుమాన్ క‌లిగినా వెంట‌నే సోష‌ల్ మీడియాని ఆశ్ర‌యిస్తున్నారు. హీటెక్కించే ఫొటోల‌తో, వీడియోల‌తో హీటెక్కిస్తున్నారు. దాంతో అటెన్ష‌న్ క్రియేట్ చేస్తున్నారు.

నాగ్ హీరోయిన్ ఇషా కోపిక‌ర్ కూడా ఇదే ప‌ని చేస్తోంది. 44 ఏళ్లు వ‌చ్చినా ఈ ఖ‌ల్లాస్ బ్యూటీ మ‌త్తెక్కించే అందాల‌తో ర‌చ్చ చేస్తోంది. నాగార్జున హీరోగా కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన `చంద్ర‌లేఖ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో నాగ్‌కి జోడీగా న‌టించి ఆట‌ప‌ట్టించింది. తొలి సినిమాతో మంచి మార్కులే కొట్టేసినా ఆశించిన స్థాయిలో మాత్రం తెలుగులో మ‌రో అవ‌కాశాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది.

నిఖిల్ హీరోగా న‌టించిన `కేశ‌వ‌` చిత్రంతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చినా ఇషాకు పెద్ద‌గా ఆఫ‌ర్లు ల‌భించ‌లేదు. ప్ర‌స్తుతం త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ `అయ‌లాన్‌`లో న‌టిస్తోంది. 44 ఏళ్లు దాటినా వ‌న్నె త‌ర‌గ‌ని అందాల‌తో క‌వ్విస్తున్న ఇషా తాజాగా సోష‌ల్ మీడియాలో పిక్క‌లు క‌నిపించేలా బికినీని త‌ల‌పించే డ్రెస్‌లో హాట్ షోతో చుక్క‌లు చూపిస్తోంది. ఈ వ‌య‌సులోనూ హీటెక్కిస్తున్న ఇషా అందాల‌కు నెటిజ‌న్ప్ ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news