దేశ వ్యాప్తంగా నులిపురుగుల నివారణ కార్యక్రమం జరుగుతోందని తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. నులిపురుగులు ఉంటే, పిల్లల్లో ఎదుగుదల ఉండదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా లో ఇంటింటికి వెళ్లి, ఆల్బండా జొల్ టాబ్లెట్స్ ఇస్తారని అన్నారు. ఆరోగ్యశ్రీ లో మార్పులు చేస్తున్నాం అని చెప్పారు. లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం అని ఆయన వివరించారు.
కార్పొరేట్ లో లాభదాయకంగా ఉన్న రోగాలకే ట్రీట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోగులను రిజెక్ట్ చేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. గాంధీ మినహా అన్ని ఆస్పత్రుల్లో ఇతర సాధారణ సేవలు మొదలయ్యాయని ఆయన వివరించారు. కోవిడ్ డ్యూటీల్లో ఉన్న వాళ్లకు మాత్రమే, క్వారంటైన్ సెలవులు అని స్పష్టం చేసారు. కరోనా డ్యూటీల్లో లేని వైద్య సిబ్బంది.. రెగ్యులర్ డ్యూటీలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.