తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి మహబూబ్ నగర్‌లో ‘రైతు పండగ’ జరుగనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా నేటి నుంచి మహబూబ్ నగర్‌లో ‘రైతు పండగ’ జరుగనుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ నెల 30న కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అటు తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీ పై తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎల్లుండి మూడు లక్షల మంది ఖాతాలలో రుణమాఫీ డబ్బులు వేస్తామని ఆయన ప్రకటించారు. పలు కారణాల వల్ల రుణమాఫీ నిలిచిన… మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి… డబ్బులు వేయబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది.