ఈ మధ్య కాలంలో ఎంతోమంది వాహనదారులు అధికారులు ఎంత సూచించినప్పటికీ రోడ్డు నిబంధనలు పాటించకుండా చివరికి ప్రమాదాలకు గురి అవుతూ ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. హెల్మెట్ పెట్టుకోవాలని ఎంతలా సూచించి అవగాహన కల్పించినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే హెల్మెట్ పెట్టుకోకుండా నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 20 లక్షలకు పైగా నమోదయ్యాయి .
ఇక రోడ్డు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా.. అటు రోడ్డు ప్రమాదాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని వాహనదారులు అందరికీ షాక్ ఇచ్చింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడిపితే మూడు నెలల పాటు లైసెన్సు నిషేధించడంతో పాటు 500 జరిమానా విధించాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో రోడ్డు నిబంధనలు పాటించకుండా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.