ఫ్రెండ్స్ ని ఎలా సర్ప్రైజ్ చేయాలో చెబుతున్న రష్మిక..?

-

కన్నడ బ్యూటీ రష్మిక మందన సినిమాల్లో ఎంతో చలాకీగా కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అంతే చలాకీగా ఉంటూ అభిమానులందరినీ ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. రష్మిక మందన్న ఎక్కడ చూసినా ఎంతో చలాకీగా కనిపిస్తూ చిలిపి చిలిపిగా మాట్లాడుతూ అభిమానులందరినీ కట్టిపడేస్తే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మందన్న వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇకపోతే ప్రస్తుతం గోవాలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంది ఈ కన్నడ బ్యూటీ. ఈ క్రమంలోనే స్నేహితుల దగ్గరికి చేరే ముందు రష్మిక మందన తన స్నేహితులను సర్ప్రైజ్ చేసిన ఒక వీడియో ని ప్రస్తుతం అభిమానులతో పంచుకుంది రష్మిక మందన. ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో రష్మిక మందన తన స్నేహితులను ఎలా సర్ ప్రైజ్ చేసిందో అన్న విషయం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news