విశాఖ గాజువాక, శ్రీనగర్లో నిన్న రాత్రి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ జరిగిన ఘటన చాలా దారుణమైనదని అన్నారు. పక్కా పథకం ప్రకారమే జరిగిందని తెలుస్తుందని, ఈ అబ్బాయి వేధించడంతో గతంలో హెచ్చరించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కేసులో ఆ అబ్బాయికి కచ్చితంగా ఉరిశిక్ష పడాల్సిన అవసరం ఉందని, త్వరితగతిన ఛార్జిషీట్ వేసి కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు.
వరలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకుంటుందని, ప్రేమ పేరుతో కిరాతకానికి పాల్పడిన వాళ్ళను ఉపేక్షించమని అన్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ వేయడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్న ఆమె ఆడపిల్లలు తిరగబడాలి, ఇబ్బంది ఎదురైతే కళ్ళలో కారం కొటైనా ప్రాణాలు నిలబెట్టుకోవాలని అన్నారు. అందరు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, సంక్షేమం, అభివృద్ధితో పాటు ..సామజిక బాధ్యత ను ప్రభుత్వం తీసుకుందని అన్నారు. ఇంటి నుంచి కోర్ట్ ల వరకు ప్రతి మహిళకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె ప్రకటించారు.