ఏపీ పోలీసులకు RGV ఝలక్ ఇచ్చారు..నేను విచారణకు రానంటూ వాట్సప్ మెసేజ్ పెట్టారు వర్మ. ఒంగోలులో పోలీసు విచారణకు రాలేనని వాట్సప్ మెసేజ్ పెట్టిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… పోలీసులకు షాక్ ఇచ్చారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో నాలుగు రోజులు గడువు కోరారు వర్మ. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని పోలీసులను కోరారు రాంగోపాల్ వర్మ.
అయితే… నేను విచారణకు రానంటూ RGV వాట్సప్ మెసేజ్ పెట్టిన తరుణంలోనే.. పోలీసులు విచారణ చేస్తున్నారు. వర్మ షూటింగ్ లో ఉన్నాడా.. లేదా.. అన్న కోణంలో వెరిఫై చేస్తున్నారు పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై ఎక్స్ లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు రాంగోపాల్ వర్మ. దీంతో రాంగోపాల్ వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.