భవిష్యత్ లో విశాఖను భయపెడుతున్న సమస్య అదేనా…!

-

విశాఖ నగరాన్ని భవిష్యతుల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఇబ్బంది పెడుతుందా? నగరవాసులకు నీటి కటకట తప్పదా? పలు సంస్థలు చేసిన సర్వేలు ఏం చెబుతున్నాయ్‌? 2040 నాటికి నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తడం ఖాయమా అన్నది ఇప్పుడు విశాఖవాసుల్లో టెన్షన్ పుట్టిస్తుంది.తాజాగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్.. ప్రపంచ వ్యాప్తంగా చేసిన సర్వే చేసి నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉన్న 100 నగరాల పేర్లను ప్రకటించింది. అందులో విశాఖ పేరును కూడా ప్రస్తావించింది. విశాఖలో నీటి కొరత కు దారితీసే పరిస్థితులపై లేఖలో వివరించిన WWF.. ఇప్పుడే అప్రమత్తం కావాలని హెచ్చరించింది.

రాజధానిగా మారితే సిటీలో జనాభా మరింత పెరుగుతడంతో పాటు నీటి సమస్యలూ పెరుగుతాయ్‌. విశాఖ చుట్టూ నదులు లేవు. సిటీలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసవి వస్తే చాలు జనాలు మంచినీటి కోసం అల్లాడిపోతుంటారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని భూగర్బ జలవనరుల విభాగం అంచనా వేస్తోంది. విశాఖలో ఉప్పు నీరు తప్ప ఏమీ లేదు. ఇజ్రాయిల్ తరహాలో సముద్రం నీటిని మంచినీటిగా మారిస్తేనే నగరం దాహార్తి తీరుతుంది. ఆ దిశగా కొత్త పథకానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆచరణలో సాధ్యమవుతుందా అనే సందేహాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news