కోర్టుల్లో లాక్ డౌన్ మీద హైకోర్టు కీలక ఆదేశాలు

-

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డిసెంబర్‌ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాలను కొద్ది సేపటి క్రితం అన్‌లాక్ విధానాలు విడుదల చేసింది. ఇప్పటికే జిల్లాల్లో భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతోండగా ఇక మీదట హైదరాబాద్ జిల్లాలోని సివిల్, జిల్లా కోర్టులు తెరవాలని హైకోర్టు ఆదేశించింది.

అలానే హై కోర్టులో డిసెంబర్ 31 వరకు ప్రస్తుత ఆన్‌లైన్, భౌతిక విచారణ కొనసాగనుందని అంటున్నారు. అంతే కాక ప్రజా ప్రతినిధుల మీద కేసుల విచారణ వేగంగా జరపాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. హై కోర్టు గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news