తెలంగాణ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ని మర్యాద పూర్వకంగా కలిశారు. వయనాడ్ లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. పుష్ప గుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ, కులగణన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారని మంత్రి పొన్నం వెల్లడించారు.
అంతకు ముందే వయనాడ్ ఎన్నికల్లో 4లక్షల 3వేల 966 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా ప్రియాంక గాంధీని స్వయంగా కలిసి అభినందించారు.