రోహిత్ కెప్టెన్ కావాలంటున్నారూ.. ఈ సర్వేలో ఆసక్తికర నిజం.!

-

ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాటి నుంచి కూడా రోహిత్ శర్మను వన్డే టి20 లకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి అనే చర్చ తెరమీదికి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ చర్చ పై అటు మాజీ క్రికెటర్లు కూడా స్పందించి అలా చేయడం ద్వారా టీమిండియాలో గొడవలు జరిగి పోతాయి అంటూ తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ఒకసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్ గా మార్చాలని డిమాండ్ తెరమీదికి వచ్చింది.

ఇక ఇటీవల ఇదే విషయంపై ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఇన్సైడ్ స్పోర్ట్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. వన్డే టి20 లకు కెప్టెన్ మార్చాలనే దానిపై ఎక్కువ మంది రోహిత్ శర్మ వైపే మొగ్గు చూపినట్లు ఈ సర్వేలో వెల్లడించింది. మొత్తంగా ఈ సర్వేలో భాగంగా 67 వేల 652 మంది ఓటు వేయగా రోహిత్ శర్మ కు ఏకంగా 52282 మంది ఓట్లు వేశారు ఇక విరాట్ కోహ్లీకి 15730 మంది ఓట్లు వేశారు. ఇలా సర్వే లో 77 శాతం ఏకంగా రోహిత్ శర్మ కెప్టెన్ కావాలి అని ఓట్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news