తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లేట్ అవుతున్నాయి. ఇప్పటి దాకా 114 డివిజన్లలో ఫలితాలు ప్రకటించగా అందులో అధికార టీఆర్ఎస్ పార్టీ నలభై ఐదు సీట్లు కైవసం చేసుకుంది. అసలు చాలా తక్కువ సీట్లలో ఉన్న బిజెపి 29 సీట్లు గెలుచుకుంది. అలాగే ఎంఐఎం పార్టీ తన పట్టుని నిలుపుకుందని చెప్పాలి ఇప్పటిదాకా ఆ పార్టీకి 39 స్థానాలు లభించాయి.
ఇక తెలంగాణా ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితం అయింది. ఇక మరో పదిహేను డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక 14 డివిజన్ లో బిజెపి ఆధిక్యతను పరుస్తోంది. 2016 తో పోలిస్తే బీజేపీ బలం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. ఇంకా 36 స్థానాలలో ఫలితాలు తేలాల్సి ఉంది.