కరోనా అని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే..’ విషయం ‘ లేదని భార్య వదిలేసింది !

-

కరోనా వైరస్ అనేక వింతలు విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అసాధారణ ప్రవర్తన కారణంగా, మధ్య ప్రదేశ్ భోపాల్ కు చెందిన ఒక వ్యక్తి తన భార్య చేతిలో అవమానానికి గురయ్యాడు. అంతే కాదు అతను మాగాడా కాదా ? అనే పరీక్ష చేయవలసి వచ్చింది. COVID-19 మహమ్మారి కారణంగా ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు పదే పదే చెబుతూ ఉండడంతో ఈ సంవత్సరం జూన్ 29 న వివాహం చేసుకున్న ఒక వ్యక్తి, వివాహం అయినప్పటి నుండి తన భార్యకు దూరంగా ఉండడం ప్రారంభించాడు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు విసిగి పోయిన అతని భార్య అతను దాంపత్య జీవితానికి పనికి రాడని భావించి అతన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులతో కలిసి జీవించడానికి వెళ్ళింది.

డిసెంబర్ 2న సదరు భార్య “బలహీనమైన” భర్త నుండి నిర్వహణ భత్యం కోరుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించింది. తన భర్త తనతో మాట్లాడుతున్నప్పుడు కూడా శారీరక దూరం కొనసాగించే వాడని ఆమె అధికారులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో మాట్లాడటం ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించలేక పోవడంతో ఆమె ఇంటి నుంచి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లానని ఆమె పేర్కొంది. ఏదేమైనా, ఈ విషయానికి సంబంధించి అథారిటీ కౌన్సెలర్లు ఆ వ్యక్తిని సంప్రదించినప్పుడు, అతను COVID-19  వ్యాపిస్తుందనే భయంతో అతను సామాజిక దూరాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. వివాహం జరిగిన వెంటనే తన భార్య కుటుంబంలో కొందరికి కరోన పాజిటివ్ వచ్చిందని ఇదే ఆమెను కలవక పోవడానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news