బిజేపీకి మొండి చెయ్యి.. రాజ్యసభ స్థానాల ఎంపికలో బాబు మార్క్ రాజకీయం..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. రాజీనామా కూడా చేశారు..దీంతో మూడు స్థానాలు ఖాళీ పడ్డాయి.. వీటికి త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎవరికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలనేదానిపై కూటమి పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.. మామూలుగా అయితే మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి.. ఖాళీగా ఉన్న మూడు స్థానాలను ముగ్గురు షేర్ చేసుకోవాలని.. కానీ ఇక్కడ చంద్రబాబునాయుడు తనమార్క్ రాజకీయానికి తెరలేపారని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది.. టీడీపీకి రెండు, జనసేనకు ఒకటి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారట.. ఈ విషయంపై ఏపీ బిజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది..

రాజ్యసభ పదవుల పంపకంపై సీఎం చంద్రబాబునాయుడు ఓ క్లారిటీకి వచ్చినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..మూడింటిలో ఒకటి జనసేనకు ఇచ్చి, మిగిలిన రెండు స్థానాలను తీసుకోవాలని చంద్రబాబు డిసైట్ అయ్యారట.. ఈ విషయంలో బిజేపీ డిల్లీ పెద్దలను ఒప్పించేందుకు ఆయన పావులు కదుపుతున్నారట.. రాజ్యసభలో టీడీపీ, జనసేనకు ప్రాతినిధ్యం లేదు.. ఈ కారణాన్ని చూపి.. మూడింటిని ఈ రెండు పార్టీలే పంచుకునేలా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు..

దీంతొ ఏపీ బిజేపీ నేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది.. నమ్మనివారిని, పొత్తులు పెట్టుకున్నవారిని మోసం చెయ్యడం చంద్రబాబునాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అని.. బిజేపీ నేతలు అంతర్గతంగా మండిపడుతున్నారట.. ఏపీలో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తమకు.. డిల్లీ పెద్దలు ఆశీస్సులున్నాయని..ఈ క్రమంలో రాజ్యసభ ఆఫర్ వస్తుందని కొందరు నేతలు భావించారు.. ఈ మేరకు అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబునాయుడ్ని పొగడ్తలతో ముంచెత్తారు.. కానీ బాబు మాత్రం బిజేపీకి రిక్తహస్తమే చూపారు..

టీడీపీ నుంచి గల్లా జయదేవ్ తోపాటు.. అశోక్ గజపతిరాజు లేదా.. బీదామస్తాన్ రావ్ ను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది..గల్లా కుటుంబంతో ఉన్న అనుబంధంతో పాటు ఢిల్లీలో గల్లా జయదేవ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఆయనకు రాజ్యసభ పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది.. గజపతి రాజు, బీదా మస్తాన్ రావులో ఎవరి వైపు చంద్రబాబు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది..

జనసేన నుంచి అనేక మంది పేర్లు వినిపిస్తున్నా.. పవన్ కళ్యాణ్‌ మాత్రం మొదటి ప్రాధాన్యత నాగబాబుకే ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.. తొలుతా ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని అందరూ భావించారు.. అది వర్కౌట్ అవ్వలేదు..దీంతో ఆయన్ని పెద్దల సభలో చూడాలని పవన్ భావిస్తున్నారట.. అందుకే ఆయన్ని రాజ్యసభకు రెఫర్ చేశారని తెలుస్తోంది.. మొత్తంగా.. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలను టీడీపీ, జనసేన పంచుకుని.. బిజేపీకి మొండి చెయ్యి చూపడంపై కమలనాథులు ఎలా స్పందిస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news