ఉత్తరప్రదేశ్ లో “లవ్ జిహాద్” చట్టం వివాదాస్పదంగా మారింది. 5 నెలల క్రితం జరిగిన పెళ్లిని కూడా కొత్త చట్టం ప్రకారం రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది. మొరాదాబాద్ లో రషీద్ అనే యువకుడు ఒక అమ్మాయిని వివాదం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో నివాసం ఉంటున్నారు. అయితే బజరంగ్ దళ్ సభ్యుల ఫిర్యాదు మేరకు… వాళ్ళు ఇద్దరినీ విడగొట్టి భర్తను జైల్లో పెట్టి అమ్మాయిని జువైనల్ హోం కి పంపించారు.
బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం చేసారు అని బజరంగ్ దళ్ ఆరోపించింది. మహిళను బలవంతంగా మతం మార్చారనే ఆరోపణలకు పోలీసులు ఆధారాలు గుర్తించలేదు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో రషీద్, అతని సోదరుడిని శనివారం విడుదల చేశారు. రషీద్ డెహ్రాడూన్ లోని బిజ్నోర్ కు చెందిన 22 ఏళ్ల పింకిని ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు.
రషీద్ ఆ రాష్ట్రంలో పని చేస్తున్నాడు. ఆయితే ఆమె గర్భంలో ఏదో తేడా ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అవసరం అని స్పష్టం చేసారు. ఆమెకు వైద్య సేవలు మెరుగ్గా అందించలేదు అంటే మాత్రం ఆమె ఆరోగ్యానికి ప్రమాదం అని వారు హెచ్చరించారు. అయితే 5 నెలల క్రితం వివాహం జరిగినా సరే ఇలా చట్టం రూపంలో ఇద్దరినీ విడగొట్టడం ఎంత వరకు భావ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు.