- చారిత్రక తప్పిదాన్ని 1992లో సరిదిద్దారు
- కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
బాబ్రీ మసీదు కూల్చివేతతో చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దినట్లు అయ్యిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నాడు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర విరాళాల సేకరణను ఉద్దేశించి ఆయన పలు వాఖ్యలు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదును 6 డిసెంబరు 1992 న కూల్చివేసి ఒక చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారని మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆక్రమణదారులు భారతదేశానికి వచ్చినప్పుడు రామాలయాలను ఎంచుకుని కూల్చివేతకు పూనుకున్నారని పేర్కొన్నాడు. అందులో బాబర్ ఒకరని తెలిపాడు. ఇలాంటి ఆక్రమణదారులకు భారతదేశ ఆత్మ రామాలయంలోనే ఉంటుందన్న విషయం తెలుసని, అందుకే వారు అలాంటి పనులను చేశారని తెలిపాడు.రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును కట్టారని తెలిపాడు. 1992 ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారని జవదేకర్ పేర్కొన్నాడు.