కంచె హీరోయిన్ కి బాలీవుడ్ ఆఫర్..

-

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్ కి ఆ సినిమాతో మంచి హిట్ ఖాతాలో పడింది. ఐతే ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. దాంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. అందం, అభినయం ఉన్నా కూడా హీరోయిన్ గా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ప్రస్తుతం బాలక్రిష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఒకానొక హీరోయిన్ గా ప్రగ్యా ఎంపికైందట. ఐతే అదలా ఉంటే, తాజాగా ప్రగ్యా జైశ్వాల్ కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చిందని వినబడుతుంది.

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న అంతిమ్ చిత్రంలో ఒక పాత్రలో కనిపిస్తుందట. ఈ మేరకు అధికారికంగా సమాచారం లేనప్పటికీ ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. తెలుగులో అంతగా సక్సెస్ కాలేని ఈ అమ్మడుకి బాలీవుడ్ ఆఫర్ రావడం అంటే గొప్ప విషయమే. మరి బాలీవుడ్ ఆఫర్ తోనైనా హీరోయిన్ గా కెరీర్ నిలబెట్టుకుంటుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news