శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ గ్రామం వైసీపీ మద్దతు అభ్యర్థి అప్పన్న కీలక కామెంట్స్ చేశారు. 2007 నుంచి అచ్చన్నాయుడు కుటుంబం మమ్మల్ని టార్గెట్ చేసిందని, రాజకీయ వ్యతిరేకత కారణంగానే మా మీద కక్ష కట్టారని ఆయన పేర్కొన్నాడు. సంఘటన జరిగిన రోజు కింజరాపు హరి ప్రసాద్ అతని కొడుకు సురేష్ మరో 20మంది దాడికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. రక్షణ కల్పిస్తామని పోలీసులు చెప్పినా తక్కువ మంది ఉండటంతో ఇబ్బంది ఎదురైందని ఆయన అన్నాడు.
మేము తప్పించుకోవడం ఒక్క నిముషం ఆలస్యం జరిగినా ప్రాణాలు పోయి ఉండేవన్న ఆయన ఊరిలో మాకు రక్షణ కావాలని అన్నారు. ఇంత వరకు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గేది లేదని ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని అన్నారు. మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వంను కోరుతున్నానని ఆయన అన్నారు. అచ్చన్నాయుడు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఇక అప్పన్న ఇచ్చిన కేస్ ఆధారంగానే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.