రైతులకు మద్ధతుగా గ్రేటా థన్‌బెర్గ్ ట్వీట్…బయటపడ్డ విషయాలు ఇవే…!

-

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు దేశాలు కూడా దీనిపై స్పందించాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున పాప్ స్టార్స్ సైతం దీని మీద అనేక కామెంట్లు చేశారు. అయితే గ్రేటా థ‌న్‌బ‌ర్గ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యమం చేస్తున్న భారత్ లోని రైతులకు సంఘీభావం తెలుపుతూ ఉన్నామంటూ ఒక వార్తా పత్రికలో వచ్చిన కధనం ప్రకారం ఈమె పోస్ట్ చేయడం జరిగింది.

అయితే ఢిల్లీలో ఉద్యమాన్ని అణచివేసే లాగ పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షలు వంటి అంశాలను ఆ వార్తా పత్రికలో ప్రచురించడం జరిగింది. అయితే ఇది అనుకోకుండా భారతదేశాన్ని కించపరిచే అంతర్జాతీయ కుట్ర అని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన వాదనను ధ్రువీకరించేటట్టు ఉంది. ఇది ఇలా ఉంటే గ్రేటా థ‌న్‌బ‌ర్గ్ భారత దేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలకు సంఘీభావం తెలియజేయాలనుకొనే వారికి టూల్ కిట్ చెయ్యాలి అని ఈమె ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఈ క్రమంలో రిపబ్లిక్ డే కి ముందు రోజు ప్రారంభమైన సంఘటిత ప్రచారాన్ని ఈమె వెల్లడించారు.

జనవరి 26 న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన గ్లోబల్ కో ఆర్డినేటెడ్ యాక్షన్ గా తెలుస్తోంది. ఈమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తే… మీ సమీపంలో భారతీయ రాయబార కార్యాలయాలు, సమీపంలో స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద అంబానీ ఆధాని కార్యకలాపాల సమీపంలో ఏది ఉన్న నిరసన కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. పైగా జనవరి 26వ తేదీ పై ఫోకస్ పెట్టాము మీరు సాధ్యమైనంత వరకు సమావేశాలు నిర్వహించడం కొనసాగించండి ఇది ఏమి ఇప్పట్లో ఆగదు అని ఆమె చెప్పడం జరిగింది. అలానే భారతదేశం ప్రజాస్వామ్య నుంచి వెనక్కి వెళ్తుందని ఫాసిజం లోకి చొచ్చుకు వెళ్ళడం వల్ల ఇది తిరోగమనం అని ఆమె ఆమె అనడం జరిగింది.

కార్యాచరణ ప్రణాళిక ద్వారా భారత ప్రభుత్వం పై అంతర్జాతీయ ఒత్తిడి తీసుకు రావడమే మనకి ముఖ్యమని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 13, 14 తేదీల్లో వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయం, మీడియా హౌస్, స్థానిక ప్రభుత్వ కార్యాలయం సమీపంలో మరొక చర్యకు దిగనున్నట్టు కూడా ఈ పత్రాల్లో కనిపిస్తోంది. అయితే కొన్ని స్వార్థ ప్రయోజన సంఘాల పై విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వాదానికి అనుకూలంగా షేర్ చేసినట్లు ఈ పత్రాల్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news