కస్టమర్స్ కోసం అదిరిపోయే ఆఫర్ ని ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ తీసుకు రావడం జరిగింది. రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మరి ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలని చూస్తే… ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC బంపర్ ఆఫర్ ఒకటి ప్రవేశపెట్టగా.. రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ కేవలం టికెట్ బుకింగ్ ఫెసిలిటీస్ మాత్రమే కాకుండా ఐముద్రా అనే యాప్ కూడా అందిస్తోంది.
ఇది ఇలా ఉండగా కస్టమర్లు కనుక ఈ ఐముద్రా యాప్ ద్వారా మంచి బెనిఫిట్స్ ని ఇస్తోంది. అయితే ఈ ఐముద్రా కస్టమర్లకు వీసా కార్డు లభిస్తుంది. కస్టమర్లు డిజిటల్ కార్డు అయినా ఫిజికల్ కార్డు అయినా పొందొచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ కార్డులని పొందాలంటే మంచి ఆఫర్లు ఉన్నాయి. మీరు కనుక ఐఆర్‌సీటీసీ ఐముద్రా వీసా లేదా రూపే కార్డు కనుక ఉపయోగిస్తే ఏకంగా రూ.2 వేల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. తాజాగా ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ లో ఈ విషయాలని చెప్పడం జరిగింది.
దీని కోసం రూ.5 వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అలానే ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది గమనించండి. ఐఆర్‌సీటీసీ ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ తో పార్ట్నర్ షిప్ కుదుర్చుకొని ఈ ఐముద్రా కార్డులను అందిస్తోంది. ఈ కార్డుని మనీ ట్రాన్స్‌ఫర్, ఏటఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ మొదలైన సేవలని పొందొచ్చు.