సన్నీ లియోన్ ని ఇంటరాగేట్ చేసిన పోలీసులు.. అసలేమైంది ?

-

ఒకప్పటి లీడింగ్ పోర్న్ స్టార్ నేటి బాలీవుడ్ స్టార్ నటి సన్నీలియోన్ ని పోలీసులు విచారించారు. ఆమె తనను చీట్ చేసిందనే ఆరోపణలతో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు.ఆ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు ఆమెను ఇంటరాగేట్ చేసినట్లు సమాచారం.. కేరళ తిరువనంతపురం లో ఉన్న ప్రైవేటు రిసార్ట్ లో ఆమెను ఇంటరాగేట్ చేసినట్లు తెలుస్తోంది.. వివరాల్లోకి వెళితే కొచ్చి చుట్టుపక్కల ఈవెంట్స్ కండక్ట్ చేసే ఈవెంట్ మేనేజర్ శియాస్ సన్నీలియోన్ మీద ఏకంగా కేరళ డీజీపీకి ఫిర్యాదు చేశాడు. తన వద్ద 29 లక్షలు తీసుకున్న సన్నీలియోని కేరళలో కొన్ని ఈవెంట్స్ చేస్తానని మాట ఇచ్చిందని కానీ ఆ మాట తప్పి ఆమె కేరళ రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

2016 నుంచి విడతల వారీగా ఈ డబ్బు తీసుకుందని ఐదు ఫంక్షన్స్ లో పాల్గొంటానని ఆమె హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకో లేకపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించినట్లు సమాచారం. సన్నీ లియోన్ కూడా తాను డబ్బు తీసుకున్న మాట వాస్తవమే కానీ అతనిని మోసం చేసే ఉద్దేశం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాక అతను చెప్పిన డేట్స్ లో తాను ఖాళీగా లేను కాబట్టి తాను కొన్ని డేట్స్ సూచించానని కానీ వాటికి ఆయన ఒప్పుకోలేదు అని చెప్పుకొచ్చింది. ఇక సన్నీ లియోన్ స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు మరో సారి ఫిర్యాదుదారుని కూడా ప్రశ్నించి ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news