ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బలహీనంగా ఉన్న నేపధ్యంలో ఆ పార్టీ నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. తాజాగా టీడీపీ యువనేత టీజీ భరత్ పార్టీ మారే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు రాగా దానిపై ఆయన స్పందిస్తూ తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉన్నా అని టీడీపీలోనే ఉంటా అని స్పష్టం చేసారు.
ప్రశ్నించే వారు ఉన్నప్పుడే పనులు జరుగుతాయన్న ఆయన అధికార పార్టీకి ఓటు వేస్తే సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉండదు అని సూచించారు. సమస్యలు పరిష్కారం కావాలన్నా.. ప్రజల తరుపున పొరాడాలన్నా టీడీపీ నుంచి పోటీ చేసే వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. తన మీద సోషల్ మీడియాలో చాలా మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని దయచేసి నమ్మవద్దని ఆయన కోరారు.